logo

విజయనగరం జిల్లాలో మహిళలే మహా రాణులు..!


ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మహిళల ఓట్లే కీలకంగా
మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 15,62,921
మంది ఉన్నారు. వీరిలో అధికంగా మహిళా ఓటర్లు
7,92,038 మంది ఉండడంతో అభ్యర్థుల గెలుపులో
వీరంతా కీలకంగా మారనున్నారు. మహిళలు ఎక్కువ
శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ
విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ దగ్గర
పడుతుండడంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో
అభ్యర్థులు బిజీ బిజీగా ఉన్నారు.

3
1537 views